🎶 Premalo – తెలుగు లిరిక్స్ | Court Movie Songs Lyrics
పల్లవి:
వేళ వేళ వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత.. అరెరే…
చిన్నిగుండె ఉన్నదంత
హాయినింపి గాలినంత
ఊదమంటే ఊపిరింత.. అరెరే…
కళ్ళు రెండు పుస్తకాలు
భాషా లేని అక్షరాలు
చూపుల్లోనే అర్థమయ్యే.. అన్నీ మాటలు…
ముందు లేని ఆణవాలు
లేని పోని కారణాలు
కొత్త కొత్త ఒనమాలు.. ఎన్నీ మాయలు…
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు
ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో.. (2X)
వేళ వేళ వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత.. అరెరే…
చరణం 1:
ఆకాశం తాకాలి అని ఉందా
నాతో రా చూపిస్తా ఆ సరదా
నేలంతా చుట్టేసే వీలుందా
ఏముంది ప్రేమిస్తే సరిపోదా
అహా మబ్బులన్ని కొమ్మలై
పూలవాన పంపితే
ఆ వాన పేరు ప్రేమ లే
దాని ఊరు మనము లే
ఏ మనసుని ఏమడగకు ఏ రుజువుని.. ఓహ్.. అంతే.. ఓహ్..
|| కథలెన్నో || (రెపీట్)
చరణం 2:
ఎంతుంటే ఏంటంటా దూరాలు
రెక్కల్లా అయిపోతే పాదాలు
ఉన్నాయా బంధించే ధారాలు
ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు
అరే నింగిలోని చుక్కలే
కిందకు వచ్చి చేరితే
అవి నీకు ఎదురు నిలిపితే
ఉండి పోవా ఇక్కడే
జాబిలి ఇటు చేరెనో పొరపాటున అని.. ఓహ్.. అంతే.. ఓహ్..
|| కథలెన్నో || (రెపీట్)
వేళ వేళ వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత.. అరెరే…
చిన్నిగుండె ఉన్నదంత
హాయినింపి గాలినంత
ఊదమంటే ఊపిరింత.. అరెరే…
కళ్ళు రెండు పుస్తకాలు
భాషా లేని అక్షరాలు
చూపుల్లోనే అర్థమయ్యే.. అన్నీ మాటలు…
ముందు లేని ఆణవాలు
లేని పోని కారణాలు
కొత్త కొత్త ఒనమాలు.. ఎన్నీ మాయలు…
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాశారు
కాలాలు దాటారు
యుద్ధాలు చేశారు
ప్రేమలో.. తప్పు లేదు ప్రేమలో.. (2X)
🎵 పాట వివరాలు
📌 పాట పేరు: ప్రేమలో
🎬 సినిమా: కోర్ట్
🎤 గాయకుడు: అనురాగ్ కులకర్ణి | సమీరా భరద్వాజ్
🎼 సంగీత దర్శకుడు: విజయ్ బుల్గేనిన్
✍ రచయిత: పూర్ణ చారీ