హుక్ స్టెప్.. పార్టీకి వచ్చి సైలెంట్‌గా ఉంటే పాపం! మెగాస్టార్ మార్క్ ఎనర్జీ చూశారా?
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే ఆడియోలో కనీసం ఒక పార్టీ సాంగ్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. దానికి తోడు బాబా సెహగల్ లాంటి ఎనర్జిటిక్ సింగర్ తోడైతే ఇక రచ్చే! 'మన శంకర వరాప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు' చిత్రంలోని "హుక్ స్టెప్" పాట ఇప్పుడు యూత్ కి ఫేవరెట్ గా మారిపోయింది. పార్టీకి వచ్చి డ్యాన్స్ చేయకుండా మూలన కూర్చునే 'ఏలియన్స్' కి ఈ పాట ఒక స్వీట్ వార్నింగ్ లాంటిది.
Hook Step Song Lyrics in Telugu
హే party కొచ్చి అయ్యో పర్లేదంటు
నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం
ఏదో దూర గ్రహం alien లాగా
అంటీ ముట్టనంటే ఎంత పాపం
హే ఎట్టా కుదురుతాది మనిషన్నాక
కాస్త కళాపోషణంటూ లేకుంటే
అడపాదడపా ఈ fun-e లేకపోతే
మాడిపోదా నీలో filament-eh
What is this break? let's do the vintage break!
Hook step, hook step, hook step, hook step
Hook step, hook step, hook step, hook step
Hook step, hook step, hook step, hook step
Hook step, hook step, hook step, hook step
హే ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని
నవ్వుకుంటాడని అనుకోకు
Mingle అవుదామని Party కొచ్చి
అట్టా single గానే నువ్వు ఉండిపోకు
హే కూచిపూడి, భలే భలే భాంగ్రానో
వచ్చుండాల్సిన పని లేదోయ్
తోచినట్టు నీ కాలు చెయ్యి ఊపి
Entertainment కుమ్మేసేయి
(టక్ టక్ టకాటక టక్)
(టక్ టక్ రగడక టక్)
What is this pause? let's try the ఊర mass
Hook step, hook step, hook step, hook step
Hook step, hook step, hook step, hook step
Hook hook hook hook hook hook step
Movie: Mana Sankara Varaprasad garu pandakki vasthunnaru…
Director: Anil Ravipudi
Music: Bheems Ceciroleo
Signers: Baba Sehgal
Lyrics: Ramajogayya Sastry
కళాపోషణ ముఖ్యం బిగిలూ!
రామజోగయ్య శాస్త్రి గారు రాసిన సాహిత్యం చాలా క్యాచీగా ఉంది. "అడపాదడపా ఈ ఫన్నే లేకపోతే.. మాడిపోదా నీలో ఫిలమెంటే" అనే లైన్ పార్టీ మూడ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసింది. డ్యాన్స్ అంటే కేవలం కూచిపూడి, భాంగ్రా మాత్రమే కాదు.. మనకి నచ్చినట్టు కాలు చెయ్యి ఊపడమే అసలైన ఎంజాయ్ మెంట్ అని ఈ పాట చెబుతుంది.
90's చిరంజీవి గారి సినిమాల్లో బాబా సెహగల్ పాడిన పాటలు ఒక ఊపు ఊపాయి. మళ్ళీ ఇన్నాళ్లకి అనిల్ రావిపూడి ఆ కాంబినేషన్ ని రిపీట్ చేశారు. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ బీట్స్ కి బాబా సెహగల్ వాయిస్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. ముఖ్యంగా పాట మధ్యలో వచ్చే 'వింటేజ్ బ్రేక్' మరియు 'ఊర మాస్' బిట్స్ కి థియేటర్లలో ఫ్యాన్స్ పేపర్లు చించి విసిరేశారు.
"హుక్ స్టెప్" పాట కేవలం సినిమాకే పరిమితం కాకుండా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా టాప్ ట్రెండింగ్ లో ఉంది. డ్యాన్స్ రాకపోయినా పర్లేదు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం లేకుండా గంతులు వేయడమే ఈ పాట ఉద్దేశం. మరి మీరు ఇంకా మీ హుక్ స్టెప్ వీడియోని షేర్ చేయలేదా?

